ఆంధ్రప్రదేశ్ సీఎం సతీమణి నారా భువనేశ్వరి ని కలిసిన అల్లాదుర్గం వెంకటేశ్వర్లు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103 వ జయంతి సందర్భంగా హైబ్రిడ్ విధానంలో మహానాడు ను జరుపుకోవడం జరిగింది. 1875 క్లస్టర్లలో మహానాడు ను జరుపుకోవడం జరిగింది అని అల్లాదుర్గం వెంకటేశ్వర్లు అన్నారు.ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మేడం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి కి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేశ్వర్లు పూల గుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలో జన్మించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ రంగంలో ప్రవేశం చేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానీయులు అన్నారు . స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు తెలుగు రాష్ట్రాల్లో పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది బడుగు బలహీన వర్గాల వారు చెప్పులు తొడుక్కొని తిరగలేని రోజులవి తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల పార్టీగా ఈరోజు దేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు.ఏపీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు బీసీల కోసం బీసీ అట్రా సిటీ చట్టం తేవడం ఎంతో గర్వంగా ఉంది మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలను ఏ పటేల్ పట్వారి వ్యవస్థ దగ్గరికి అప్పులకు పోకుండా ఒక్కొక్కరికి పది లక్షల వరకు రుణాలు తీసుకుంటున్నారంటే అది హైటెక్ నాలెడ్జి అని, మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు లేదా చట్టపరంగా కటకటాలోకి వెళ్లాల్సింది అనీ అన్నారు తెలంగాణను అభివృద్ధి చేసిన గొప్ప అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పోలంపల్లి అశోక్ ,గూడెపు రాఘవు లు, శ్రీనివాస్ రెడ్డి ,తేలు కంటి శ్రీనివాస్ అబ్బాస్ ,సత్తయ్య, శాంతయ్య, పాల్గొనడం జరిగింది.











