దైవభక్తి చాటుకున్న సర్పంచ్ పోతుల వెంకటేష్ యాదవ్
దిశ పవర్ బచ్చన్నపేట మండలం లో ఆలయాల పునర్నిర్మాణానికి, దైవ కార్యక్రమాలకు పెద్దపీట వేయడం ద్వారా చాలా మంది సర్పంచులు తమ దైవభక్తిని చాటుకుంటారు.తమ్మడపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి నక్క వాని గూడెం సర్పంచ్ పోతుల వెంకటేష్ యాదవ్ 5000 రూపాయలు కానుక అందించే దైవభక్తి చాటుకున్నారు. అడిగిన వెంటనే విరాళామందించి గుడి నిర్మాణానికి తన వంతు కానుక అందించినందుకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తమ్మడపల్లి సర్పంచ్ బెజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలకొండ నాగరాజు, వార్డు మెంబర్ జెర్రిపోతుల మధు, కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 18











