దిశ పవర్,బచ్చన్నపేట: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ బోర్డు మెంబర్‌గా నియమితులైన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌ను బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యానాథ్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయ బోర్డు మెంబర్‌గా లక్ష్మీనారాయణ నాయక్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి సేవలో, ఆలయ అభివృద్ధిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డిపల్లి సర్పంచ్ నల్లా సిద్ధిని నరమ్మ మల్లయ్య. పడమటి కేశవాపూర్ మాజీ సర్పంచ్ గిద్దాల రమేష్, డిసిసి మెంబర్ గుర్రం బాలరాజ్, మాజీ ఎంపీటీసీ అంబాలా ఆగయ్య,కొడవటూరు మాజీ డైరెక్టర్ భాస్కర్,మండల కార్యదర్శి బొడ్డు గణేష్, కొన్నే వార్డు మెంబర్ గున్నల సందీప్. బసిరెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటయ్య గౌడ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు











