బచ్చన్నపేట మండల కాంగ్రెస్ రథసారథి మసూద్‌కు గ్రామ అధ్యక్షుల ఘన సన్మానం
దిశపవర్,బచ్చన్నపేట:పార్టీ నమ్ముకున్న నిఖార్సైన కార్యకర్తకు, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఉద్యమ నేతకు కాంగ్రెస్ అధిష్ఠానం పట్టం గట్టింది. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథిగా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ మసూద్‌కు క్షేత్రస్థాయిలో మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో బోనకలూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు బోదాసు సామి, లక్ష్మాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చిలుకా ప్రవీణ్‌లు మసూద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. పార్టీ అప్పగించిన కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ.. విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ (NSUI) నుంచి యువజన కాంగ్రెస్ వరకు, ఆపై ప్రధాన పార్టీలో మసూద్ పోషించిన క్రియాశీలక పాత్ర అమోఘమని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జెండా మోసి, అధిష్ఠానానికి నమ్మకమైన బంటుగా నిలిచిన మసూద్‌కు మండల అధ్యక్ష పదవి దక్కడం కాంగ్రెస్ శ్రేణులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తే మసూద్ నాయకత్వంలో బచ్చన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని రాజకీయ ఆధిక్యత లభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయకేతనానికి ఈ నియామకం ఒక దిక్సూచిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఇజ్జగిరి రాములు, కొడవలూరు సిద్దేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దత్తరపు నరేష్, మానపల్లి మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.











