న్యూఢిల్లీ, జూలై 23 (దిశ పవర్):భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆయన నివాసంలో సేవాదళ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి, ఆయనకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శులు సుంకరి శ్రీనివాస్ రెడ్డి, గుగ్గిళ్ల ఆది నారాయణ, జనగామ నియోజకవర్గ బ్లాక్ సేవాదళ్ అధ్యక్షుడు లింగాల వెంకట్ రెడ్డి, బిర్రు సత్యనారాయణ, బోట్ల జీవరత్నం, గుగులోతు కిసాన్ నాయక్ పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.
Post Views: 28











