దిశ పవర్ బచ్చన్నపేట మండలం:కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన బచ్చన్నపేట మాజీ సర్పంచ్ కొండ సిద్దయ్య మృతి చెందడంతో బచ్చన్నపేట మండల కేంద్రంలో విషాదఛాయలుఅలుముకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణంగా భావిస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన ఎన్నో సంవత్సరాలుగా కృషి చేశారు.గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేసిన కొండ సిద్దయ్య సేవలను పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.కొండ సిద్దయ్య తనయుడు మాజీ ఉప సర్పంచ్ కొండ హరికృష్ణ కూడా తండ్రి అడుగుజాడల్లో ప్రజా సేవలో కొనసాగుతున్నారు. కొండ సిద్దయ్య మృతికి కాంగ్రెస్ నాయకులు ఎండి మసూద్, జిల్లా సందీప్, చెరుకూరి శ్రీనివాస్, దాతరపు నరేష్, జ్యోతి భాస్కర్, రాగీరు సత్తయ్య, కోడూరి మహాత్మ చారి, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.











