మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా రవీందర్
దిశ పవర్ బచ్చన్నపేట, ఆగస్టు 15: బచ్చన్నపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను జిల్లా రవీందర్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మృతులు దాచేపల్లి కిషన్, కర్రే ఎల్లమ్మ, జిలాని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గంధ మల్ల జంపయ్యకు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చన్నపేట గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడానికి ముందుంటాన్ని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా బుచ్చయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











