E-PAPER

గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపాలి నేడు చౌరస్తాలో మహా ధర్నా కదలిరండి:ఎండి ఫిరోజ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపాలి నేడు చౌరస్తాలో మహా ధర్నా కదలిరండి:ఎండి ఫిరోజ్

16 Aug 2026, 7:33 am DISHA POWER

దిశ పవర్ బచ్చన్నపేట, ఆగస్టు 16:గోదావరి జలాలతో బచ్చన్నపేట మండలంలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో వర్షాలు లేకపోవడంతో వరి నార్లు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో బచ్చన్నపేట మండలం కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని ఫిరోజ్ పేర్కొన్నారు. సాగునీటి వనరులు అడుగంటిపోవడంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి జలాలను చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు తరలించి రైతులను ఆదుకోవాలని కోరారు.రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆదివారం ఉదయం 10 గంటలకు బచ్చన్నపేట చౌరస్తాలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎండి ఫిరోజ్ తెలిపారు. రైతులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!