E-PAPER

బొమ్మకూరు నీటితో తమ్మడపల్లికి జలకళ: సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గొలనుకొండ నాగరాజు ‘భగీరథ’ ప్రయత్నం.. 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బొమ్మకూరు నీటితో తమ్మడపల్లికి జలకళ: సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గొలనుకొండ నాగరాజు ‘భగీరథ’ ప్రయత్నం.. 

13 Sep 2026, 4:49 pm DISHA POWER

బొమ్మకూరు నీటితో తమ్మడపల్లికి జలకళ:

సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గొలనుకొండ నాగరాజు ‘భగీరథ’ ప్రయత్నం..

దిశపవర్,బచ్చన్నపేట సమస్యలు ఉన్నాయని ప్రభుత్వాల వైపు చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. నిధులు లేవని నెపం నెట్టలేదు. "నేను నా ప్రజల కోసం ఉన్నాను.. వారి దాహం తీర్చడం నా బాధ్యత" అని నిరూపించారు ఆ ప్రజా ప్రతినిధి ఆయనే బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలనుకొండ నాగరాజు . ప్రజా ప్రతినిధి అంటే కేవలం పదవి అనుభవించడం కాదు, ప్రజల కష్టాల్లో తోడుండే నిజమైన నాయకుడని ఆయన నిరూపించిన తీరు ప్రస్తుతం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. తమ గ్రామానికి తాగునీరు, సాగునీరు అందక రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి సర్పంచ్ బేజాడి సిద్ధులు మనసు చలించింది. ఎలాగైనా గ్రామస్తుల కష్టాలు తీర్చాలని దృఢ సంకల్పంతో నడుం బిగించారు. ప్రభుత్వాల నుండి వచ్చే జీవోల కోసం, నిధుల కోసం వేచి చూడకుండా, గ్రామస్తులను ఏకం చేశారు. అందరి సహకారంతో గత పది రోజులుగా రేయింబగళ్లు చెమటోడ్చి, శ్రమదానంతో బొమ్మకూరు రిజర్వాయర్ నుండి మన మైసమ్మకుంటకు సాగునీటిని విజయవంతంగా తీసుకువచ్చారు. ఎండిపోతున్న మైసమ్మకుంట ఈరోజు జలకళను సంతరించుకోవడంతో గ్రామ రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

సమస్యలను చూసి తప్పించుకునే ఈ రోజుల్లో, పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదని తమ్మడపల్లి సర్పంచ్ నిరూపించారు. మండలంలో నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న ఇతర గ్రామ సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు బేజాడి సిద్ధులు చేసిన ఈ భగీరథ ప్రయత్నం ఒక పెద్ద కనువిప్పు. "మనసుండాలే గానీ మార్గం ఉంటుంది" అని చాటిచెప్పిన తమ్మడపల్లి సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలనుకొండ నాగరాజు . ఈ సందర్భంగా గ్రామ రైతులు కొబ్బరికాయ కొట్టి, కుంకుమ పూలు జల్లి స్వాగతించి సర్పంచ్, ఉప సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు.

Generating image…

బొమ్మకూరు నీటితో తమ్మడపల్లికి జలకళ:

సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గొలనుకొండ నాగరాజు ‘భగీరథ’ ప్రయత్నం..

దిశపవర్,బచ్చన్నపేట సమస్యలు ఉన్నాయని ప్రభుత్వాల వైపు చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. నిధులు లేవని నెపం నెట్టలేదు. “నేను నా ప్రజల కోసం ఉన్నాను.. వారి దాహం తీర్చడం నా బాధ్యత” అని నిరూపించారు ఆ ప్రజా ప్రతినిధి ఆయనే బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలనుకొండ నాగరాజు . ప్రజా ప్రతినిధి అంటే కేవలం పదవి అనుభవించడం కాదు, ప్రజల కష్టాల్లో తోడుండే నిజమైన నాయకుడని ఆయన నిరూపించిన తీరు ప్రస్తుతం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. తమ గ్రామానికి తాగునీరు, సాగునీరు అందక రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి సర్పంచ్ బేజాడి సిద్ధులు మనసు చలించింది. ఎలాగైనా గ్రామస్తుల కష్టాలు తీర్చాలని దృఢ సంకల్పంతో నడుం బిగించారు. ప్రభుత్వాల నుండి వచ్చే జీవోల కోసం, నిధుల కోసం వేచి చూడకుండా, గ్రామస్తులను ఏకం చేశారు. అందరి సహకారంతో గత పది రోజులుగా రేయింబగళ్లు చెమటోడ్చి, శ్రమదానంతో బొమ్మకూరు రిజర్వాయర్ నుండి మన మైసమ్మకుంటకు సాగునీటిని విజయవంతంగా తీసుకువచ్చారు. ఎండిపోతున్న మైసమ్మకుంట ఈరోజు జలకళను సంతరించుకోవడంతో గ్రామ రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

సమస్యలను చూసి తప్పించుకునే ఈ రోజుల్లో, పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదని తమ్మడపల్లి సర్పంచ్ నిరూపించారు. మండలంలో నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న ఇతర గ్రామ సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు బేజాడి సిద్ధులు చేసిన ఈ భగీరథ ప్రయత్నం ఒక పెద్ద కనువిప్పు. “మనసుండాలే గానీ మార్గం ఉంటుంది” అని చాటిచెప్పిన తమ్మడపల్లి సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలనుకొండ నాగరాజు . ఈ సందర్భంగా గ్రామ రైతులు కొబ్బరికాయ కొట్టి, కుంకుమ పూలు జల్లి స్వాగతించి సర్పంచ్, ఉప సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు.

Disha Power Editor
dishapower.in

బొమ్మకూరు నీటితో తమ్మడపల్లికి జలకళ: సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గొలనుకొండ నాగరాజు ‘భగీరథ’ ప్రయత్నం.. 

బొమ్మకూరు నీటితో తమ్మడపల్లికి జలకళ:

సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గొలనుకొండ నాగరాజు ‘భగీరథ’ ప్రయత్నం..

దిశపవర్,బచ్చన్నపేట సమస్యలు ఉన్నాయని ప్రభుత్వాల వైపు చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. నిధులు లేవని నెపం నెట్టలేదు. "నేను నా ప్రజల కోసం ఉన్నాను.. వారి దాహం తీర్చడం నా బాధ్యత" అని నిరూపించారు ఆ ప్రజా ప్రతినిధి ఆయనే బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలనుకొండ నాగరాజు . ప్రజా ప్రతినిధి అంటే కేవలం పదవి అనుభవించడం కాదు, ప్రజల కష్టాల్లో తోడుండే నిజమైన నాయకుడని ఆయన నిరూపించిన తీరు ప్రస్తుతం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. తమ గ్రామానికి తాగునీరు, సాగునీరు అందక రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి సర్పంచ్ బేజాడి సిద్ధులు మనసు చలించింది. ఎలాగైనా గ్రామస్తుల కష్టాలు తీర్చాలని దృఢ సంకల్పంతో నడుం బిగించారు. ప్రభుత్వాల నుండి వచ్చే జీవోల కోసం, నిధుల కోసం వేచి చూడకుండా, గ్రామస్తులను ఏకం చేశారు. అందరి సహకారంతో గత పది రోజులుగా రేయింబగళ్లు చెమటోడ్చి, శ్రమదానంతో బొమ్మకూరు రిజర్వాయర్ నుండి మన మైసమ్మకుంటకు సాగునీటిని విజయవంతంగా తీసుకువచ్చారు. ఎండిపోతున్న మైసమ్మకుంట ఈరోజు జలకళను సంతరించుకోవడంతో గ్రామ రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

సమస్యలను చూసి తప్పించుకునే ఈ రోజుల్లో, పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదని తమ్మడపల్లి సర్పంచ్ నిరూపించారు. మండలంలో నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న ఇతర గ్రామ సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు బేజాడి సిద్ధులు చేసిన ఈ భగీరథ ప్రయత్నం ఒక పెద్ద కనువిప్పు. "మనసుండాలే గానీ మార్గం ఉంటుంది" అని చాటిచెప్పిన తమ్మడపల్లి సర్పంచ్ బేజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోలనుకొండ నాగరాజు . ఈ సందర్భంగా గ్రామ రైతులు కొబ్బరికాయ కొట్టి, కుంకుమ పూలు జల్లి స్వాగతించి సర్పంచ్, ఉప సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!