గన్నారం గ్రామంలో బతుకమ్మలతో తల్లి కూతురు
రాయపర్తి, అక్టోబర్ 18 దిశ పవర్
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ ను ఆదివారం గన్నారం గ్రామంలో మహిళలు ఘనంగా జరుపుకున్నారు, రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళలు,యువతులు సంతోషంగా జరుపుకున్నారు, తంగేడు, గునుగు.బంతి చామంతి పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేసి సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు,యువతులు ఒక్క చోటుకు చేరి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు, అనంతరం చెరువు, కుంటల లో బతుకమ్మను నిమజ్జనం చేశారు, సర్పంచ్ ,బతుకమ్మ సంబరల్లో సర్పంచ్ గడ్డం విజయ, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
Post Views: 129











