నేషనల్ హైవే-30 డైవర్షన్ అలైన్మెంట్‌ను పరిశీలించిన
NHAI అధికారులు

ప్రజా గొంతుక న్యూస్, మార్చి 25 /భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని వి.కె.సి.ఎం (VKCM) ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నేషనల్ హైవే-30కి సంబంధించి రెండో డైవర్షన్ అలైన్మెంట్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వికేసిఎం ఎక్స్టెన్షన్ ఫేస్-2 ప్రతిపాదిత డైవర్షన్ మార్గంలో ఉన్న ప్రస్తుత స్థల పరిస్థితులు, రహదారి మళ్లింపు అలైన్మెంట్, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు మరియు భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణ పనుల సాధ్యాసాధ్యాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గనుల విస్తరణ దృష్ట్యా ఈ రహదారి మళ్లింపు అత్యంత కీలకం కానుంది.
ఈ తనిఖీ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (GM) . ఎం షాలేం రాజు , నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య, అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్, ఎన్‌హెచ్ కన్సల్టెంట్, ఏరియా సర్వే ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వారితో పాటు ప్రాజెక్ట్ ఆఫీసర్ (వీకే సీఎం) ఎం.వి. నరసింహారావు, ఏజీఎం (సివిల్) రామకృష్ణ మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొని అలైన్మెంట్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను పరిశీలించారు.
ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులు ఈ సందర్భంగా నిర్ణయించారు.











