ఉద్యమకారులను అరెస్టు చేయడం దుర్మార్గం
మలిదశ ఉద్యమకారుడు సంగిశెట్టి క్రిస్టఫర్
వలిగొండ మార్చి 28 ప్రజా గొంతుక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని టి యు జేఏసీఉద్యమ నాయకురాలు భోగె పద్మ ఆధ్వర్యంలో శనివారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు కానీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో తరలించారు భోగే పద్మను అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషనుకు తరలించడం దుర్మార్గమని టి యు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘీశెట్టి క్రిస్టఫర్ హెచ్చరించారు. అయినా మొక్కవోని ధైర్యంతో పోలీస్ స్టేషన్ లోనే దీక్ష కూర్చోవడం జరిగిందన్నారు ఉద్యమకారులకు రావలసిన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అరెస్ట్ చేసిన ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని క్రిస్టఫర్ డిమాండ్ చేశారు
Post Views: 90











