గోల్డెన్ అవర్‌లో ప్రాణరక్షకులుగా 108 సిబ్బంది
– ఏడాదిలో 21,157 మందికి ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సేవలు
ప్రజాగొంతుక మార్చి 28 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రతినిధి:
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవులుగా 108 అంబులెన్స్ సిబ్బంది నిలుస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న 108 సేవలు హనుమకొండ జిల్లాలో ప్రజలకు వేగవంతమైన వైద్య సహాయం అందిస్తున్నాయి.జిల్లాలో 16 అంబులెన్సులు పనిచేస్తుండగా, జీపీఎస్ సాంకేతికతతో కాల్ వచ్చిన వెంటనే సమీప అంబులెన్స్‌కు సమాచారం చేరుతుంది. దీంతో ఘటన స్థలానికి 12 నిమిషాల లోపే చేరుకుని ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.2025 మార్చి నుంచి ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు మొత్తం 21,157 మంది ప్రాణాలను కాపాడినట్లు అధికారులు తెలిపారు.వివిధ అత్యవసర కేసులు ఇలా ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు 2620 గర్భిణీలు 1225, అపస్మారక స్థితి 1683,కడుపునొప్పి 2175, శ్వాస సమస్యలు 1647,ఇతర ప్రమాదాలు 2023, గుండెనొప్పి 1663,విషం తాగిన వారు 930, మూర్చ 1096,ఆత్మహత్యాయత్నాలు 583, పక్షవాతం 485,విషపురుగుల కేసులు 36, కాలిన గాయాలు 25,ఇతర మెడికల్ కేసులు 4641,ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండగా, సిబ్బంది మానవ సేవే మాధవ సేవ అనే భావంతో నిరంతరం సేవలందిస్తున్నారు. కాల్ వచ్చిన క్షణాల్లోనే భోజనం వదిలి ఘటన స్థలానికి పరుగులు తీస్తున్నారు.ప్రోగ్రాం మేనేజర్ పార్టీ శివకుమార్ మాట్లాడుతూ, “కాల్ వచ్చిన 30 సెకండ్లలో వాహనం బయలు దేరుతుంది.బాధితులకు త్వరితగతిన సేవలు అందించడం మా లక్ష్యం అన్నారు.జిల్లా 108,102 మేనేజర్ మండ శ్రీనివాస్ మాట్లాడుతూ, 24 గంటలు సేవలు అందిస్తున్నాం. ప్రజలు 108, 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర్’లో స్పందిస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్న 108 సిబ్బంది నిజమైన ప్రాణరక్షకులుగా నిలుస్తున్నారు…











