కార్మికుల శ్రేయస్సుకోసం సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ ధర్నా
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 01 ప్రజా గొంతుక
కేంద్ర ప్రభుత్వ కార్మిక,రైతు, ప్రజా వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డే సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారుకేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2026 ఏప్రిల్ 1న నిరసన దినం ప్రగతి నగర్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు బాచుపల్లి మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను సంపూర్ణంగా రద్దుచేసి వాటి స్థానంలో 4 కోడ్లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 4 లేబర్ కోడ్లు అమలయితే దేశంలోని 47 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు 25 కోట్ల మంది సంఘటితరంగ ఉద్యోగ కార్మికులు రెక్కలు లేని పక్షుల్లాగా కార్మికులు సరైన చట్టాలు అమలు కాక అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతారని అన్నారు.ఈ దేశంలో కార్మికవర్గం దేశ స్వాతంత్య్రానికి పూర్వం నుండే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పాతరవేస్తున్న దుర్దినం ఇప్పుడున్నదాన్నారు. ప్రశ్నించే గొంతులకు తాళాలు వేసినట్లు, వెలిగెత్తి చాటుతున్న చేతులకు సంకెళ్ళు వేసినట్లు, గొంతువిప్పి తమ హక్కుల సాధనకు నినదిస్తున్న కార్మికలోకం నినాదాల హోరునుండి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం పొందుతున్నట్లు భావిస్తుంది తప్పితే ఈ కోడ్లు అమలయితే మరింత కార్మికవర్గం తెగించి పోరాటాలు, ఉద్యమాలు చేస్తుందని, అదే సందర్భంలో దేశవ్యాపితంగా కార్మికవర్గాన్ని ఐక్యం చేసి మరో స్వతంత్ర పోరాటానికి సన్నద్దం అవుతారు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక. బిజెపి పాలనలో ప్రజల ఆర్ధిక వ్యవస్థ దిగజారుతుందని, నిరుద్యోగం, నిత్య దరిద్రం, సామాన్య ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై దాడులు జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాల నేపధ్యం, సంఘాలు ఏర్పర్చుకొనే హక్కును కాలరాయటం, సమ్మె చేసే హక్కును, నిరసనలు తెలియజేసే హక్కును నిర్దాక్షణ్యంగా బిజెపి ప్రభుత్వం అనిచివేస్తుంది. బిజెపి పాలనలో ఆదానీ, అంబానీలకు కారుచౌకగా రైల్వేలు, ఓడరేవులు, బొగ్గుగనులు, చమురు, ఉక్కు రక్షణ, రహదారులు, విమానాశ్రయాలు, బ్యాంకులు, బీమా, టెలికాం, పోస్టల్, అనుశక్తి, విద్యుత్ ఉత్పత్తి, ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించింది. పేదలు, కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు వారి ప్రయోజనాల కోసం సామాన్యుల భూములను లాక్కోవడానికి తెచ్చిన 3 నల్ల చట్టాలను రైతుల పోరాటాల వల్ల ప్రభుత్వం వెనుకకు తీసుకున్నప్పటికీ, రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుంది. విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వివిజీ రామ్జీ చట్టం 2025 తీసుకొచ్చి కార్మిక లోకాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయటాన్ని కార్మికలోకం జీర్ణించుకోవటం లేదు అన్నారు.కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి.విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.నాలుగు లేబర్ కోడ్ల ల అమలును నిరసిస్తూ బ్లాక్ డేపై డిమాండ్లను రద్దు చేయాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.శంకర్, దేవా, కవిత, నరేష్, కిషోర్ నాయక్, శ్రీనివాస్, స్వామి,జయమ్మ, పరశురాములు,సాయి కార్మికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు,











