శ్రీ శ్రీ శ్రీ కృత్య ప్రత్యంగిరా దేవి కోటి మహా యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న శ్రీరాములు అందెల
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్ లో గల నాదర్గుల్ డివిజన్ సిరిపురం యాదయ్య గ్రౌండ్స్ లో *శ్రీ శ్రీ శ్రీ సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్* ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి *శ్రీ శ్రీ శ్రీ కృత్య ప్రత్యంగిరా దేవి కోటి మహా యజ్ఞ* మహోత్సవానికి *మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు* ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ… దేశం, రాష్ట్రం ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ మహాయజ్ఞం నిర్వహించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన, బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ రచ్చ లక్ష్మణ్, బిజెపి ఉపాధ్యక్షులు సైదులు, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, మల్లేష్, బీజేవైఎం నాయకులు సతీష్ నంద మరియు వివిధ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











