మానవత్వం చాటుకున్న నల్గొండ ఆపద్బాంధవ్ ఫౌండేషన్………
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:04
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామానికి చెందిన
పిడుగు అశోక్ దివ్యభారతి
అకాల మరణం చెందడంతో
వారి ముగ్గురు చిన్న ఆడపిల్లలు అనాథలుగా మారిన విషాద ఘటన అందరినీ కలచివేసింది.
ఈ నేపథ్యంలో మానవత్వంతో ముందుకు వచ్చిన
ఆపద్బాంధవ్ ఫౌండేషన్ – నల్గొండ
వారి తరపున
1,01,000 ఆర్థిక సహాయం
అదనంగా
21,000 విలువైన నిత్యావసర వస్తువులు, బట్టలు, పాఠ్యపుస్తకాలు
అందజేయడం జరిగింది.
ఈ మహత్తర సేవా కార్యక్రమానికి సహకరించిన
ప్రతి ఒక్క దాతకు ఫౌండేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఫౌండేషన్ అధ్యక్షులు పంజాల శశికుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
అధ్యక్షులు: పంజాల శశికుమార్
ఉపాధ్యక్షులు: పొట్టపాక గణేష్
జనరల్ సెక్రటరీ: స్వప్న యాదవ్
ట్రెజరర్: శ్రీకాంత్ చారి
సభ్యులు:
బాజా అరుణ్, దూదిమెట్ల సాయికుమార్, శ్రవణ్, హరికృష్ణ,
బండారపు నరేష్, వినయ్ గౌడ్, బాబు, మేడి సురేష్,
దూదిమెట్ల వేణు యాదవ్ మరియు గ్రామ యువత
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగించడానికి మీ అందరి సహకారం అవసరం అని అన్నారు











