సామాజిక సమసమాజ నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనే మన లక్ష్యం: కప్పాటి పాండురంగా రెడ్డి
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో పాండురంగారెడ్డి మాట్లాడుతూ…భారత మాజీ ఉప ప్రధాని, ‘బాబూజీ’గా ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తెలంగా జాగృతి కార్యాలయం లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, జాగృతి కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రావు జీచిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, స్వతంత్ర భారత నిర్మాణంలోనూ జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.కుల వివక్ష లేని సమాజం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది.
రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అద్వితీయమని, ముఖ్యంగా హరిత విప్లవం ద్వారా దేశ ఆహార భద్రతలో ఆయన ముద్ర చెరగనిదని పేర్కొన్నారు.
జాగృతి ఆధ్వర్యంలో ముందుకు..”తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క దిశానిర్దేశంలో.. బాబూ జగ్జీవన్ రామ్ కన్న కలలను నిజం చేసేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలి. సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం శ్రమిస్తూ, వెనుకబడిన వర్గాల గొంతుకగా నిలవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి” అని కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు.
జాగృతి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని బాబూజీకి అంజలి ఘటించారు.
మహనీయుని త్యాగాలను స్మరించుకోవడం.యువతకు ఆయన ఆశయాలను వివరించడం.పార్టీ మరియు జాగృతి శ్రేణులను లక్ష్యం దిశగా నడిపించడం. మన ముందున్న లక్ష్యం…. కప్పాటి పాండురంగా రెడ్డి
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు











