షెడ్యూల్ కులాల సంఘం ఆధ్వర్యంలోడాక్టర్ బాబు జగజీవన్ రావ్ 118 వ ఘనంగాజయంతి ఉత్సవాలు
ఉప్పల్ ప్రజాగొంతుక ప్రతినిధీ
ఉప్పల్ నియోజకవర్గం లోని చిలకానగర్ డివిజన్ నందు గత పదిహేను సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా షెడ్యూల్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావ్ జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు బాబు జగజీవరావు 118 వ జయంతోత్సవం సందర్భంగా షెడ్యూల్ కులాల సేవా సంఘం అధ్యక్షులు కూరెల్లి యాదగిరి, కొంగర రామచందర్ ఆధ్వర్యంలో అంత గల అశోక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి రాపోలు రాములు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు మనందరికీ ఆదర్శం దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా 30 సంవత్సరాలు వివిధ హోదాలో మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, తపాలా శాఖ మంత్రిగా, పునరావాస శాఖ మంత్రిగా వివిధ పదవులను ఎంతో శక్తివంతంగా నిర్వహించడం జరిగినది. ఏ పదవి చేపట్టిన ఆ పదవికి వన్నెతెచ్చారు సమాజంలో అందరికీ సమాన హక్కులు కావాలని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి దేశానికి నాలుగవ ఉప ప్రధానిగా అత్యున్నత పదవిని కూడా నిర్వహించడం జరిగినది. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఒక ఎస్సీలే కాకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు, మైనార్టీలు ,ఓసీలు ఒక సంఘటితంగా ఏర్పడి సమసమాజ నిర్మాణం కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జల్లి మోహన్, అంబేద్కర్ సంఘాల కన్వీనర్ రాపోలు రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగంరెడ్డి, రాజేష్ ముదిరాజ్ ,కొంపల్లి బాలరాజు, చిలకనగర్ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బిఆర్ఎస్ నాయకులు మాసశేఖర్ ఈరెల్లి రవీందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి, బిజెపి నాయకులు శ్రీకాంత్,దేవసాని భానుచందర్ అలాగే షెడ్యూల్ కులాల సేవా సంఘం మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కొండ్ర రాములు, బలరాం ,నర్సింగరావు, అంజన్ కుమార్ ,పల్నాటి డేవిడ్, సీనియర్ నాయకులు విబి నరసింహ ,వజ్జల ఆంజనేయులు, సాయన్న ,పరమేష్ ,పురుషోత్తం వీర షెడ్యూల్ కులాల సంఘం సభ్యులు మంచినీళ్ల శ్రీనివాస్, జానీ, మహేందర్ యాదగిరి జేరిపోతుల చంద్రయ్య, చింతల ఐలయ్య, జోగు రామ నరసయ్య, మొగిలి పాక రామచంద్రం ,రాజు లతోపాటు కుమ్మరి కుంట యాదగిరి కూడా పాల్గొనడం జరిగినది.











