ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమం

ప్రభుత్వ జూనియర్ కళాశాల గట్టు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గొర్ల ఖాన్ దొడ్డి గ్రామంలో వేసవి కాల ప్రత్యేక శిబిరం ఏడవ రోజు ముగింపు కార్యక్రమ జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా గ్రామ సర్పంచ్ శ్వేతా , ఉప సర్పంచ్ ఆంజనేయులు , పాఠశాల ప్రధానోపాధ్యాయు లు శశికాంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, జూనియర్ లెక్చరర్ కల్లిముల్ల, వార్డ్ మెంబర్స్ రాధా మహేష్, సుగుణ శ్రీనివాస్, రమ్యశ్రీ నరసింహులు, భాను ప్రకాష్, గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు, గ్రామ సర్పంచ్ శ్వేతా ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గత ఏడు రోజుల నుండి గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ పనులను కొనియాడారు వాలంటీర్లు చేసిన స్వచ్ఛభారత్ ను ఆదర్శంగా తీసుకొని గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తామని చెప్పారు. తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమ్మర్ స్పెషల్ క్యాంపు సర్టిఫికెట్స్ సర్పంచ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శశికాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గ్రామంలో చేపట్టిన వివిధ స్వచ్ఛభారత్ పనులను విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ రోజురోజుకు పెంపొందించుకోవాలని కోరారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కే ఎస్ డి రాజు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహణకు సహకరించిన గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి మరియు వార్డు మెంబర్స్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శశికాంత్ రెడ్డి , ఎన్ఎస్ఎస్ పూర్వపు వాలంటరీ తేజ, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన జూనియర్ లెక్చరర్ కలీముల్లా వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం ఏర్పాటు గురించి వివరించాడు. తదనంతరం గ్రామ సర్పంచ్ ,పంచాయతీ కార్యదర్శి , ప్రధానోపాధ్యాయులు, వార్డ్ మెంబర్స్ లను శాలువాలతో సత్కరించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది శ్రీదేవి, మహేష్, భరత్, వివేక్, శేఖర్, మోహన్, నరసింహులు తదితరులు పాల్గొ ని ముగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











