దోమల నివారణకు చర్యలు చేపట్టిన సర్పంచ్…
ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బండనాగారం గ్రామంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఇజ్జగిరి రాములు దోమల నివారణ కార్యక్రమం భాగంగా మందు ను ఇంటింటికి పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంజరుగుతుందని,గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్ గా గెలిచి గ్రామాన్ని ఆరోగ్య రక్షగా కాపాడుకోవడానికి ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు మెంబర్ ఇప్ప శ్రీధర్ రెడ్డి,ఉప సర్పంచ్ మల్లయ్య, ఇజ్జగిరి నరేష్, చల్ల ప్రభాకర్ రెడ్డి, చల్లా రమేష్ రెడ్డి, వార్డు మెంబర్ ఆరేళ్ల భాస్కర్, ఆశా వర్కర్ ఇజ్జగిరి అనిత , వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు కూడా చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











