ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్లపల్లి ఆధారాలన్నీ సిద్దం తప్పుడు ప్రచారాలు
మానుకోండి మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు
గుండ్రపల్లి గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది
తనపై వస్తున్న ఆరోపణలను
మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు తీవ్రంగా ఖండిస్తూ
అవి పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు
ప్రతి రూపాయి ఖర్చుకు రికార్డులు
లేకుండా పనులు జరగలేదని తెలిపారు
ప్రతి పనికి సంబంధించిన బిల్లులు,
వోచర్లు లెక్కలు ఉన్నాయని
ఆయన అన్నారు
ప్రస్తుతం అధికార పార్టీ ముసుగులో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని
ఆయన మండిపడ్డారు ఆధారాలు చేతిలో ఉన్నప్పటికీ
ఆధారాలు లేవు అంటూ ఆరోపించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు
ఆధారాలు లేని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని
ఇది పూర్తిగా సిగ్గుచేటు చర్య అని ఘాటుగా స్పందించారు
బహిరంగ చర్చకు సిద్ధం ఏవిచారణకైనా వెనుకాడం లేదు
తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు ఆధారాలతో సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధమని
మాజీ సర్పంచ్ తెలిపారు
అవసరమైతే బహిరంగ చర్చకు రావాలని,
లేదా అధికారుల సమక్షంలో విచారణ జరిపించాలని
సవాల్ విసిరారు
నిజాలు బయటపడితే ఎవరు అప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు
18 లక్షల పనుల వివరాలు వెల్లడి
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను కూడా ఆయన వెల్లడించారు
1, బిర్రు సాయిలు ఇంటి నుండి ఏర్పుగొండ ఎల్లమ్మ ఇంటి వరకు రోడ్డు పనులకు
రూ 4.50 లక్షలు
2, ముత్యాల వెంకటయ్య ఇంటి నుండి బిర్రు ముత్తయ్య ఇంటి వరకు రూ 2 లక్షలు
3, షేక్ గోరేమియా ఇంటి నుండి షేక్ కరీం ఇంటి వరకు రూ, 2 లక్షలు
4, మైనార్టీ స్మశాన వాటిక బ్రిడ్జి నిర్మాణానికి
రూ, 4 లక్షలు
5, గ్రామపంచాయతీ
గది నిర్మాణానికి రూ, 2 లక్షలు
ఇలా మొత్తం రూ, 18 లక్షలు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు
అవకతవకలు లేవు రాజకీయ కక్షలే కారణం
గ్రామ అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్ని ఖర్చులు పారదర్శకంగా జరిగాయని మాజీ సర్పంచ్ స్పష్టం చేశారు
తనపై ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కక్షలే కారణమని ఆరోపించారు
నిజాలు బయట పెడతాం ప్రజలే తీర్పు చెబుతారు అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు











