అల్వాల గ్రామంలో అంగన్ వాడి స్కూల్ డే ప్రోగాం…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:08
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల గ్రామంలో అంగన్ వాడి స్కూల్ డే ప్రోగాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా
టి సి డి ఎస్ – సి డి పి ఓ, నాట్కోట్రస్ట్ శ్రీ వంశీ కృష్ణ మరియు ,గ్రామ సర్పంచ్ , హాజరవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు నేర్చుకున్న కృత్యాలు ప్రదర్శించడం.
జరిగింది.గ్రామ ప్రజలు మరియు తల్లిదండ్రులు, మరియు ఈ కార్యక్రమానికి
విచ్చేసిన వారందరు కృత్యాలను వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.
భాషా కార్నర్, సృజనాత్మకత, నాటకీకరణ,బ్లాక్ అండ్ పజిల్స్ ఈ4
కార్నర్స్ ద్వారా ప్రీస్కూల్ చెప్పబడును. పిల్లల అభివృద్ధి
అంచనా వేయడానికి ప్రీస్కూల్ అసెస్మెంట్ కార్డుద్వారా
పెరేంట్స్ మీటింగ్ ద్వారా తల్లులకు తెలియజేయటం జరిగింది. అంగన్వాడి పిల్లల విద్యా ప్రాముఖ్యతను వివరించి అంగన్ వాడి
కేంద్రాలలో పిల్లల యొక్క నమోదును ఎన్రోల్మెంట్
పెంచగలరని అందరూ కృషి చేయలని కోరినారు.
ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన వారు- సర్పంచ్
లక్ష్మీ సైదులు ,
సి డి పి ఓ- విజయలక్ష్మీ , ఏ సి డి పి ఓ- సువర్ణ, సూపర్వైజర్-
విజయలక్ష్మీ ,నాట్కాట్రస్ట్ జి కే ఎన్.రావు, భరత్,
పల్ రెడ్డి ఫౌండేషన్ – రాంరెడ్డి ,హెడ్ మాస్టర్ శక్రూ నాయక్ ,
ఆ గ్రామ పంచయితీ సెక్రటరీ – సైదా నాయక్, మాజి సర్పంచ్.
పాపిరెడ్డి, ఉపసర్పంచ్ జె రమేష్ , వార్డు మెంబర్లు
గ్రామ పెద్దలు, గర్బిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు
ఇంకా గ్రామ ప్రజలు, అంగన్వాడి టీచర్స్, నాట్కో పి ఎస్ ఇ లు.
ఆయాలు, ఇంకా తదితరులు పాల్గోన్నారు.











