ఆ గ్రామంలో రేషన్ లేదు, వయోవృద్ధుల తీవ్ర ఇబ్బందులు.
రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందచేసిన పెండ్లి తిరుపతి.
ప్రజా గొంతుక( ఏప్రిల్ 9 )కాల్వ శ్రీరాంపూర్ : అ గ్రామంలో సుమారు 700 జనాభా కలిగిన కుటుంబాలు నివసిస్తాయని, తమకు స్థానికంగా రేషన్ దుకాణం లేకపోవడం తో,ప్రతినెల రేషన్ సరుకులు సకాలంలో పొందలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని పెండ్లి తిరుపతి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని అంకంపల్లి గ్రామంలో పౌరసరాల శాఖ నుంచి బియ్యం తదితర వస్తువులు సరఫరా చేస్తున్న, గ్రామపంచాయతీ ఏర్పడిన,మా గ్రామం లొ రేషన్ షాపు లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా లబ్ధిదారువేరే ఊరికి పోయి తెచ్చుకోవడం కష్టతరంగా ఉందని, తీవ్ర ఇబ్బందులు గురికవలసి వస్తుంది లబ్ధిదారులు తెలిపారు.రేషన్ సరుకులు కోసం 2-3 కిలోమీటర్లు ఉన్న మడిపల్లి గ్రామానికి ఆటోల ద్వారా, కాలినడకన వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,తాసిల్దార్ రాముడు కి వినతి పత్రం అందజేసినట్లు ఆ గ్రామానికి చెందిన పెండ్లి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా రేషన్ దుకాణం లేకపోవడంతో వేరే గ్రామాలకు వెళ్ళ వలసివస్తుంది అని, నడవలేక ఉన్నవారు సరుకులు పొందలేకపోతున్నారని అన్నారు. కనీసం మా సమస్యను చెప్పుకునేందుకు అధికారుల వద్దకు కూడా వెళ్లేని పరిస్థితిలో మా గ్రామంలో అనేకమంది వృద లబ్ధిదారులు ఉన్నారని వారు తెలిపారు. మా గ్రామం లొ ప్రతినెల రేషన్ సరుకులు పొందేలా చౌక ధరల దుకాణాన్ని ఏర్పడు చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రంలో పేర్కొని అందజేసినట్లు వారు తెలిపారు.











