నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న 9000 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:10
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న 9000 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నగరంలోని ప్రధాన పురవీధుల్లో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నల్లగొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివ చరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని వారన్నారు.స్కాలర్షిప్‌లు ఇవ్వలేని ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హతే లేదు. వేల కోట్ల బకాయిలను నిలిపివేసి విద్యార్థులను అప్పుల బారిన పడేస్తోందని వారన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఆపేసే కుట్ర పన్నుతున్నదని వారు తెలియజేశారు.అదే కుట్ర జరిగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్దు,శివ,పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.











