మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

బిసి టి యు రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్
ప్రజా గొంతుక న్యూస్, (ఏప్రిల్ 11)సూర్యాపేట: గొప్ప సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని బిసిటియు ఆధ్వర్యంలో శనివారం ఆయన ఘనంగా పూలమాలలు నివాళులు అర్పించి మాట్లాడారు.ఆనాటి అగ్రకులాల దురహంకారానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం పరితపించిన మహానీయులు అని కొనియాడారు.పూలే జీవితాన్ని నేటి సమాజం స్పూర్తి గా తీసుకోవాలని తెలిపారు.ప్రపంచ మేధావి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గురువుగా పూలే మహానీయులుగా బడుగు బలహీన వర్గాల కు చైతన్య దీపికా అని చెప్పారు.కార్యక్రంలో బిసిటియు జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల దేవరాజు, గౌరవాధ్యక్షులు పోతురాజు నరసయ్య, జిల్లా కోశాధికారి మండవ సైదులు పాల్గొన్నారు











