ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సి సి కెమెరాలు పెట్టాలి…..
సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు….
డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి డిమాండ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:12
పారదర్శకత కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సి సి కెమెరాలు పెట్టాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్.
డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి.
వ్యవస్థాపక అధ్యక్షులు సమాచార హక్కు వికాస సమితి.
తెలంగాణ రాష్ట్రంలో గల అన్ని పోలీస్ స్టేషన్ లలో పెట్టిన మాదిరిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సి సి కెమెరాలు పెట్టాలనీ సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనులు జరగడానికి ఇన్వార్డ్ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలి. దరఖాస్తులు తీసుకునే సమయంలో అట్టి దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదు చేశారా? లేదా? దానికి అవసరమైన పత్రాలు జతపరచినారా? లేదా క్షుణ్ణంగా పరిశీలించి , అవసరమైన వారికి తగిన సలహాలు ఇచ్చి దరఖాస్తులను స్వీకరించాలి. స్వీకరించిన దరఖాస్తులను నిర్దేశించిన గడువు రోజుల లోపు పని పూర్తి కావాలి పని పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి.ఔట్ వార్డ్ ద్వారా ప్రజలకు అందాలి.
గడువు లోపల పని పూర్తి కాకపోతే ప్రతి గంటకు సంబంధిత ఉద్యోగి/ ప్రభుత్వ శాఖ తగిన జరిమాన చెల్లించాలి. ఈ విధానంతో సర్వీస్ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లును వెలుగులోకి,చట్టంగా రాకుండా ఉద్యోగ వర్గాలు, నాయకులు తొక్కి పెట్టినట్టుగా ఉంది. గత 5 సంవత్సరాల క్రితం డ్రాఫ్ట్ గా రెడీ చేసిన సర్వీస్ యాక్ట్ బిల్లు జాడ లేదు. అడిగేవాడు లేడు.
ప్రభుత్వ కార్యాలయంలలో నేరుగా ఉద్యోగులను కలిసి పైరవీలు చెయ్యడం,వారి పనికి ఆటంకం కలుగ కుండా, పనుల్లో నిర్లక్ష్యం,జాప్యం జరుగకుండా, ఉద్యోగులు తమ స్థానాల్లో ఉండి సక్రమంగా విధులు నిర్వహించే విధంగా నియంత్రణ జరగాలంటే. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించే వారిపై చర్యలు తీసుకోవడానికి, ప్రతి ఉద్యోగి ప్రజల పనులు చేయడంలో జాప్యం చెయ్యకుండా ఉండడానికి, విధులు నిర్వర్తించే సమయంలో బయట తిరగకుండా ఉండడానికి
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సి కెమెరాలు పెట్టాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది.
రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు వారి పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో జరిగే విషయాలను పరిశీలించే విధంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ మాదిరిగా ప్రతి ప్రభుత్వ శాఖ రాష్ట్ర కార్యాలయంలో వారి పరిధిలోని కార్యాలయాలను, ఉద్యోగుల హాజరును, పని చేయు సమయాన్ని పరిశీలించే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసుకోవాలని. తద్వారా పారదర్శక పాలన. జవాబుదారీతనం పెరగడం, పనులు వేగంగా జరగడం, ఉద్యోగుల పనులు ఆటంకం కలుగకుండా , పైరవీలకు తావు లేకుండా పనులు జరగడానికి వీలు ఉంటుంది. ప్రజా పాలన ప్రజలకు అందుతుంది. నిజాయితీకి నిలువుటద్దం, ప్రజల సేవకోసమే మేము, మా పోరాటం అనే రాజకీయపార్టీలు, పాలనలో ఉన్న పాలకులు, తప్పులు చెయ్యని నిప్పు లాంటి అధికారులు ఈ దిశగా నిర్ణయాలు, ఇంకా మెరుగైన నిర్ణయాలతో పాలన చేస్తామనే దమ్ము వున్న వారు అమలు చేయండి.
ప్రతిపక్షాలు, వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చెయ్యండి. మేము అధికారంలోకి వస్తె చేస్తామని ప్రకటించండి.
గ్యారంటీ గా చేస్తామనే వారు ఉంటే ప్రకటించండి. అని సమాచార హక్కు వికాస సమితి ప్రజల పక్షాన అడుగుతోంది.ఈ డిమాండ్ నచ్చిన వారు షేర్ చెయ్యండి. చీకటిని,అవినీతిని, అక్రమాలను తిడితే పోవు.
చిరు దీపం వెలిగిస్తే చీకటి పరార్.
అవినీతిని,అక్రమాలకు చెక్ పెట్టాలంటే… కఠిన శిక్షలు ఉండాలి. ప్రతి పౌరుడు ప్రశ్నించాలి. ప్రక్షాళన జరగాలి. యర్రమాద కృష్ణారెడి.
వ్యవస్థాపక అధ్యక్షులు సమాచార హక్కు వికాస సమితి. సెల్ 9949649766











