ఎల్కతుర్తి కేజీబీవీలో ప్రతిభ చాటిన ఇంటర్ విద్యార్థినులు

కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అనిత దేవి
ప్రజా గొంతుక:ఎల్కతుర్తి, ఏప్రిల్ 12
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ లో ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థినులు ప్రతిభ చాటారు.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 24 మంది విద్యార్థినుల్లో 21 మంది ఉత్తీర్ణులై 87 శాతం ఫలితాలు నమోదు కాగా, ద్వితీయ సంవత్సరంలో 27 మంది విద్యార్థినుల్లో 26 మంది ఉత్తీర్ణులై 96 శాతం ఫలితాలు సాధించారు.ప్రథమ సంవత్సరంలో ఏం.శివాని (సి.ఈ.సి) 435 మార్కులు, జి.శ్రావ్య (ఎం.పీ.హెచ్.డబ్ల్యూ) 489 మార్కులు సాధించారు, ఎస్ వైష్ణవి (395), ఏ ఆక్షిత (466). ద్వితీయ సంవత్సరంలో ఏం.వైష్ణవి (సి.ఈ.సి) 873 మార్కులు, ఏం.అక్షిత ఎం.పీ.హెచ్.డబ్ల్యూ (970) పి వైశాలి (750), టి అశ్విత (933) మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ అనిత దేవి మాట్లాడుతూ, విద్యార్థినులు కష్టపడి చదివి ఈ విజయాలు సాధించారని తెలిపారు. ఉపాధ్యాయులు సమష్టిగా శ్రమించి పిల్లలను మెరుగ్గా తీర్చిదిద్దారని అభినందించారు.ఈ విజయాలతో పాఠశాల గౌరవాన్ని పెంచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.











