తెలుగు భాష దైవ భాష”తెలుగు భాషలో త్రైత శకం 48 కాలసూచిక ఆవిష్కరణ
ఆవిష్కరించిన రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హింగీ భాస్కర్
ప్రజా గొంతుక,ఎల్కతుర్తి, ఏప్రిల్ 12:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవస్థానం ఆలయ అర్చకులు, ధూపదీప నైవేద్య సంఘం ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ మండల అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ..శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన తెలుగు క్యాలెండర్ను రైతు రక్షణ సమితి వరంగల్,హనుమకొండ జిల్లాల ఉమ్మడి అధ్యక్షులు హింగే భాస్కర్ త్రైత శకం 48 కాలసూచికను ఆవిష్కరించారు అనితెలియచేస్తూ..శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు 1978 లో శ్రీ కాలయుక్తి నామ సంవత్సరంలో ప్రబోధాశ్రమాన్ని స్థాపించినప్పటి నుండి “త్రైత శకము” ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుత శ్రీ పరాభవ నామ సంవత్సరంతో త్రైత శకము-48వ సంవత్సరంలోకి ప్రవేశించిందని చెప్పారు.యోగీశ్వరులు సమాజానికి శాస్త్రబద్ధమైన ఆత్మజ్ఞానాన్ని అందించేందుకు “త్రైత సిద్ధాంతం”ను ప్రతిపాదించి ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం సిద్ధాంతాలకంటే భిన్నంగా, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనే మూడు ఆత్మలపై ఆధారపడి ఉన్న త్రైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని వివరించారు.యోగీశ్వరులు రచించిన “త్రైత సిద్ధాంత భగవద్గీత” గ్రంథం శ్రీకృష్ణుని నిజ భావాన్ని వివరిస్తూ విశిష్ట స్థానం సంపాదించిందని చెప్పారు.భగవద్గీతతో పాటు ఇతర దైవగ్రంథాలలోని జ్ఞానం ఏకరూపమైందని, ప్రజలు కులమతాలకు అతీతంగా దైవగ్రంథాలను అధ్యయనం చేయాలని ఆయన బోధించినట్లు తెలిపారు.బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలపై వివరణలతో పాటు, ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడించే 100కు పైగా గ్రంథాలు, 200కు పైగా ప్రవచనాలను యోగీశ్వరులు సమాజానికి అందించారని చెప్పారు. “తెలుగు భాష దైవ భాష” అని ప్రకటిస్తూ, తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు.ఆధ్యాత్మిక రంగంలో 100కు పైగా గ్రంథాలను రచించిన ఏకైక వ్యక్తిగా యోగీశ్వరులను గుర్తిస్తూ, ఆయన నిర్మించిన ప్రబోధాశ్రమం మరియు సేవలను “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్”లో నమోదు చేసి సత్కరించినట్లు తెలిపారు.మన పండుగలు గ్రంథం ద్వారా యుగాది పండుగ విశిష్ఠతను వివరించిన యోగీశ్వరులు, యుగాది నుండి ప్రకృతి, గ్రహాల ప్రభావం, మనిషి జీవనంలో మార్పులు సంభవిస్తాయని తెలిపారు.తెలుగు మాసాలు,తిథులతో కూడిన కాలసూచికను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.ఈ సందర్భంగా హింగే భాస్కర్ మాట్లాడుతూ, సరళమైన తెలుగు భాషలో రూపొందించిన ఈ క్యాలెండర్ ప్రతి ఒక్కరికీ ఉపయోగంగా ఉంటుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండలం ప్రబోధా సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి,రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్,జిల్లా ఉపాధ్యక్షులు,హింగే రవీందర్, రైతు నాయకులు, ఎర్రబెల్లి రవీందర్ రావు, భాషబోయిన కుమార్ యాదవ్, అంబల ప్రవీణ్, విజయ్, రాకేష్,స్రవంతి,రాణి,తనుష,దివిజ,క్షేత్రజ్ఞ ఋషి, మోక్షజ్ఞ,తదితరులు పాల్గొన్నారు











