స్నేహితుని కుమార్తె వివాహంలో కలిసిన చిన్ననాటి స్నేహితులు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 12 ఏప్రిల్ 2026.
చిన్ననాటి స్నేహితుని కుమార్తె వివాహం సందర్భంగా ఎంతో కాలం తర్వాత మన చిన్ననాటి మిత్రులందరం ఒకే చోట కలవడం చాలా ఆనందంగా అనిపించింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళ వారి పేట గ్రామానికి చెందిన వెన్నం అనిత విష్ణువర్ధన్ రెడ్డి కుమార్తె వివాహము ఖానాపురం మండలంలో గల రెడ్డి పెద్ద రంగారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ( నూతన వధూవరులు *వైష్ణవి అనిల్ రెడ్డి )* వివాహానికి హాజరైన విష్ణువర్ధన్ రెడ్డి స్నేహితులు. వీరంతా ఖానాపురం మండలం బుధరావుపేట జడ్.పి.హెచ్.ఎస్ 1995 – 96 బ్యాచ్ చెందిన స్నేహితులు ఈ వివాహంలో కలిశారు.
పాత జ్ఞాపకాలు మళ్లీ తలుచుకుంటూ గడిపిన ఆ క్షణాలు మరపురానివి.
మన స్నేహం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని, ఇలాంటి కలయికలు మరెన్నో జరగాలని , ప్రతి స్నేహితుని ఇంటిలో ఏ కార్యక్రమాలు జరిగిన , అందరూ హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. స్నేహితులంతా కలిసి సుమారు రూపాయలు 16,500 /- విలువచేసే ఐ ఎఫ్ బి కంపెనీకి చెందిన రిఫ్రిజిరేటర్ ను స్నేహితుని కుమార్తె వివాహానికి కానుకగా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇలాగే ఆదర్శంగా నిలవాలని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెళ్లికి సంబంధించిన బంధువులు , విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు మరియు స్నేహితులైన విష్ణు బాబు , వీరన్న, రాము, హుస్సేన్, పూర్ణచందర్, వెంకటేశ్వర్లు, ఫరీద్, కృష్ణ , సీతారాం, షైనాజ్ బేగం, వాసవి, పూర్ణిమ , సుశీల , సువర్ణ , నిజాముద్దీన్ , కే వెంకన్న, కే వెంకటేశ్వరరావు , ప్రేమలత , కర్ణాకర్, పూర్ణిమ , హేమ , రాణి , బి కృష్ణ మూర్తి , కే స్వామి, , దేవ్ సింగ్ , విజయ్ కుమార్, శ్రీరాములు, ఎం వెంకన్న , యాకస్వామి , ఏ శ్రీనివాస్ , పాపారావు , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.











