పేరూరు అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం……
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:13
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం పేరూరు అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ విజయలక్ష్మి హాజరై ప్రీస్కూల్ విద్య గురించి అనగా 30 నెలల నిండిన దగ్గర నుండి అంగన్వాడికి పంపించడం వలన పిల్లలకు ప్రీస్కూల్ విద్యా తోపాటు పౌష్టికాహారం కూడా అందించడం జరుగుతుంది , పిల్లల మెదడు అభివృద్ధి ఆరు సంవత్సరాల లోపు 90 శాతం డెవలప్మెంట్ అవుతుంది అలా డెవలప్ కావాలంటే పిల్లలకు ఆట, పాట ,కథ , సంభాషణ,సృజనాత్మకత ,శాస్త్రీయ పరిజ్ఞానం, ఆటలు వలన శారీరక అభివృద్ధి జరుగుతుంది పాటలు కథలు సంభాషణ మంచి అలవాట్లు ఈ విధంగా నేర్చుకోవడం వలన పిల్లలకు మంచి నడవడిక భాషాభివృద్ధి మేధోఅభివృద్ధి జరుగుతుంది కాబట్టి పిల్లలు అంగన్వాడీ ద్వారా స్వేచ్ఛగా నేర్చుకోగలుగుతారు, పిల్లలు ఫోన్లకు కూడా దూరంగా ఉంటారు అని చెప్పడం జరిగింది ,అలాగే పోషణ పక్షంలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్ గురించి పిల్లలకు జంక్ ఫుడ్ దూరంగా ఉండాలని ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు సమతుల ఆహారం అందేలా చూడాలని చెప్పడం జరిగింది, సీజనల్గా దొరికే పండ్లు ,ఆకుకూరలు, కూరగాయలు ,పప్పులు, తగిన మోతాదులో నూనె, తృణధాన్యాలు, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకో కోవాలని చెప్పారు,తదుపరి సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ పిల్లలని ప్రవేట్ స్కూల్ కన్నా అంగన్వాడీలోనే ఎల్కేజీ యూకేజీ నేర్చుకుంటారని అంగన్వాడి స్కూలు గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం కావాలంటే పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలని మన ఊరు మనబడి మన పిల్లలు వేరే వలస పోకుండా ఉండాలని మన ఊరి బడిలోనే చదువుకోవాలని,చెప్పినారు, సాంబయ్య పిల్లల కోసం స్టీల్ వాటర్ బాటిల్స్ డొనేట్ చేసినారు ,షేక్ షమీం అక్బర్ పిల్లల కోసం ఎగ్గు తినడానికి గిన్నెలు డొనేట్ చేసినారు, గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి ఐదుగురు పిల్లలకు ప్రీ స్కూల్ సర్టిఫికెట్స్ అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, సరిత సైదా బేగం ఫరీదా, నాట్కో ట్రస్ట్ సూపర్వైజర్ స్ ,భరత్ , లక్ష్మణ్ , అంగన్వాడీ టీచర్ వనజ, రాజ్యలక్ష్మి, బాజీద, ఫర్జానా , శోభ, సపోర్టు టీచర్ మస్తాన్ బి సోనీ బేగం, ఆశ గ్రామ సెక్రెటరీ జాన్ బాబు గారు, గ్రామ పెద్దలు పిల్లలు మహిళలు పాల్గొనడం జరిగింది.











