ఆలూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమం
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
బడి బాట లో బాగంగా ఈ రోజు ఎంపీపీస్ ఆలూరు పాఠశాల నందు అందరికి ఆదర్శంగా గ్రామ ఉప సర్పంచ్ సల్ల మహేష్ ఇద్దరు కుమారులు స్నేహిత్ రెడ్డి,తన్విష్ రెడ్డి లను 4 వ తరగతి,1 వ తరగతి నందు అడ్మిషన్ తీసుకొని చేర్పించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నల్లాల స్వామి మాట్లాడుతూ అందరికి ఆదర్శంగా అన్ని వసతులు వున్న ప్రభుత్వ పాఠశాలలో ఉప సర్పంచ్ తమ పిల్లలను అడ్మిషన్ తీసుకొని చేర్చడం అభినందనీయమని అలాగే మిగతా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్ కి పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి అని తెలిపారు .ఈ కార్యక్రమంలో
ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు
అక్కినపల్లి సతీష్
ఉపాధ్యాయులు
సునీత,సాయికృష్ణ,రమేష్ రెడ్డి
ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ లక్ష్మయ్య
విద్యాభివృది కమిట్ అధ్యక్ష కార్యదర్శులు
చిలుక సంజీవ్,నల్లాల శేఖర్,
మాజీ సర్పంచ్ గంగాధర్
మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్
గ్రామ కార్యదర్శి రమ్య
గ్రామ పెద్దలు,గ్రామస్తులు పాల్గొన్నారు.











