కల్వకోల్‌లో చిన్న అంజయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు – ముగ్గు కార్యక్రమం ఘనంగా
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో అర్హత గల లబ్ధిదారుడు అరడి చిన్న అంజయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు వద్ద సంప్రదాయబద్ధంగా ముగ్గు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,వార్డ్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.ముఖ్యంగా సాయిని గోపాల్ రెడ్డి, అరటి కుమార్,తిరుమల యాదయ్య,జంపుల భారతమ్మ,పులిమామిడి లక్ష్మీనారాయణ గౌడ్, బక్కని రవి మాదిగ,అరటి వెంకటేష్, గుర్రంపల్లి నరసింహ, రామచంద్రి, లబ్ధిదారుడు చిన్న అంజయ్య,లక్ష్మమ్మ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధికి ఇటువంటి పథకాలు ఎంతో ఉపయోగకరమని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.











