అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా,నిర్వహించాలి.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
అంగన్వాడికేంద్రాలద్వారాసరఫరాచేసేపౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు సక్రమంగా అందజేస్తూ సమర్థవంతంగానిర్వహించాలనిజిల్లాకలెక్టర్,రిజ్వానబాషాషేక్,అన్నారు.
శనివారంగట్టుమండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలోఉన్న అంగన్ న్వాడికేంద్రాన్ని,ప్రభుత్వప్రాథమికపాఠశాలనుజిల్లాకలెక్టర్,ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతోకలెక్టర్,ముచ్చటించారు. పాఠశాల విద్యార్థులతో వారునేర్చుకున్నఅంశాలనుచదివించిఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూగట్టుమండలంఆస్పిరషనల్,బ్లాక్ గా ఉందని,సంపూర్ణత అభియాన్ కార్యక్రమం లో ఉన్న(7 )అంశాలను 100%జరిగేలాచూడాలని,అంగన్,వాడికేంద్రాలకువచ్చేగుడ్లపరిమాణం తక్కువగాఉంటేవాపస్ పంపించాలని అక్కడి అధికారులనుఆదేశించారు.
పలువురుచిన్నారులఎత్తు,బరువు కొలతలను పరిశీలించితగుసూచనలుచేశారు.వండినఆహారాన్నిపరిశీలించిసంతృప్తివ్యక్తంచేశారు.అనంతరం ప్రభుత్వప్రాథమిక పాఠశాలలోవిద్యార్థులతోవివిధపాఠ్యాంశాలనుచదివించారు.పాఠశాలలో మధ్యాహ్నభోజన పథకం అమలుగురించి మాట్లాడారు.అంతకుముందుగ్రామంలోనిర్మాణంలోఉన్నఅంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
మరుగుదొడ్లనునాణ్యతతోనిర్మించాలని,నిబంధనలను ఉల్లంఘిస్తే తగుచర్యలుతీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగాకలెక్టర్,సంబంధితఅధికారులను హెచ్చరించారు.
ఈకార్యక్రమంలోఐసిడిఎస్ సిడిపిఓహేమలత, సూపర్వైజర్ కృష్ణవేణి, పంచాయతీరాజ్ ఏఈ రాజకుమార్,తదితరులు పాల్గొన్నారు.











