*కాసువాగు భూములపై కిచ్చెన్న భరోసా*
*నాదర్ గుల్ రైతులతో కేఎల్ఆర్ భేటీ*
*సీఎం రేవంత్ దృష్టిలో ఉంది: కేఎల్ఆర్*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 19:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుక్కుగూడలో కేఎల్ఆర్ మాట్లాడుతూ….ప్రభుత్వ భూములను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా కాపాడుకుంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్షారెడ్డి హామీ ఇచ్చారు.
తుక్కుగూడ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి కాసువాగు భూముల రైతులు కేఎల్ఆర్ ను కలిశారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…. నాడు ఇందిరమ్మ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వ బోమని హామీ ఇచ్చారు.613 సర్వేనంబర్ లో 370 ఎకరాలకు పైగా నాదర్ గుల్ లో సాగులో దశాబ్దాలుగా ఉన్నారు.గత పాలకులు ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై ప్రభుత్వ భూముల్లో పాగా వేశారని కిచ్చెన్నగారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ భూముల విషయం తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని తెలిపారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కేఎల్ఆర్ హామీపై రైతన్నలు, కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.











