ప్రభుత్వ పాఠశాలల ఉమ్మడి బడిబాట కార్యక్రమం…..
కార్యక్రమంలో పాల్గొన్న నిడమనూరు…. సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్
జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు
జిల్లా పరిషత్ హై స్కూల్ నిడమనూరు మరియు
మండల ప్రాథమిక పాఠశాల నిడమనూరు ఆధ్వర్యంలో నిడమనూరు
గ్రామ సర్పంచ్ శ్రీమతి సంధ్య శ్రీనివాస్ మరియు నిడమనూరు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గౌతమ్,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాశ్రీమతి చంద్రకళ ఇతర హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు సిఆర్పి గంగరాజు ,పాల్గొన్న కార్యక్రమం సంతృప్తికరంగా జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అన్నిరకాల వసతులు,ప్రత్యేక బోధనా పద్ధతులు,ప్రక్రియలు,ఎస్ ఎల్ ఎం,టి ఎల్ ఎం ఉచిత పుస్తకాలు,నోట్ బుక్స్,వర్క్ బుక్స్, టై, బెల్ట్, షూస్, డ్రెస్సులు,భోజనం,(వచ్చే అకడమిక్ ఇయర్ నుండి టిఫిన్లు), విద్యేతర కార్యక్రమాలు(ఆటలు,పాటలు,
సాంస్కృతిక కార్యక్రమాలు,కళలు,కమ్యూనికేషన్ స్కిల్స్,శాస్త్రీయ ప్రయోగాలు,ప్రాజెక్టులు, ఎడ్యుకేషనల్ టూర్లు ,డిజిటల్ ఎడ్యుకేషన్ (ఐ ఎఫ్ పి ప్యానెల్ & స్మార్ట్ టీవీస్ ద్వారా) లాంటివి పైసా ఖర్చు లేకుండా పొందగలరని వీధుల్లో తల్లిదండ్రులకు ప్రేరణ ఇవ్వడం జరిగింది. చాలా మంది సుముఖంగా ఉండడం మంచి పరిణామం.











