E-PAPER

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ 

22 Apr 2026, 3:54 pm DISHA POWER

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్

ప్రజా గొంతుక ఏప్రిల్ 22:ఎల్కతుర్తి:

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఊతమిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ సుకినే సంతాజి బుధవారం పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దామెర చింతలపల్లి బౌవుపేట తిమ్మాపూర్ కేశవపూర్ దండేపల్లి సూరారం కోతుల నడుమ ఎల్కతుర్తి గ్రామాలలో ప్రభుత్వ అధికారులతో కలిసి కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాగునీరు ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అకాల వర్షాల సమయం కావున ధాన్యం తడవకుండా తార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ప్రతి కొనుగోలు కేంద్రంలో సరిపడ గన్ని సంచులు నిల్వ ఉంచి రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బంది పడకుండా టోకెన్ వ్యవస్థను అమలు చేస్తూ క్రమబద్ధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇక కేంద్రాల్లో తూకం యంత్రాలుతో పారదర్శకంగా తూకం వేయిస్తున్నామని తెలిపారు. ధాన్యం నాణ్యత తనిఖీ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి రైతులకు సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం కాకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా సౌకర్యం కోసం ట్రాక్టర్లు లారీలు ఏర్పాటు చేసి ధాన్యం తరలింపును వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

రైతులు ఈ కేంద్రాలను వినియోగించుకుని ప్రభుత్వ మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని చైర్మన్ సంతాజి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి ఏడిఏ డి.ఆదిరెడ్డి ఏఈఓ రాజకుమార్ ఏవో పున్నం చందర్ తిరుపతి ఎంపీడీవో విజయ్ కుమార్ ఏపిఎం పి.కవిత మార్కెట్ డైరెక్టర్లు సుధాకర్ గౌడ్, గొడిశాల రాజయ్య గౌడ్ బచ్చు బాబురావు సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి వివిధ గ్రామల సర్పంచులు మునిగడప లావణ్య శేషు మంకని పద్మ చేరాలు బొంకూరి రజిత అంబాల రాజ్ కుమార్ బత్తిని రవీందర్ గౌడ్ ముప్పు మానస మహేందర్ శ్రీకాంత్ రెడ్డి భాష బోయిన లీల కొమరయ్య మాట్ల లింగయ్య గొల్లపెల్లి సంపత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బుల్లెపోగు రమేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ మాజీ అధ్యక్షులు హింగే శ్రీకాంత్ హుస్నాబాద్ బీమ్ రాజ్ వివిధ గ్రామాల వార్డు సభ్యులు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు రైతులు తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!