మునిరాబాద్‌లో కవితక్క సభ హోరాహోరీ
భవిష్యత్తులో సీఎం కవితక్కే: పాండురంగా రెడ్డి

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 25:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో… పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క ఏర్పాటు చేయనున్న నూతన పార్టీ ఆవిర్భావ సభకు మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలంగాణ జాగృతి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు శనివారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు.మేడ్చల్ జిల్లా మునిరాబాద్‌లో జరుగుతున్న ఈ సభకు మహేశ్వరం శ్రేణులు ఉత్సాహంగా,పండుగ వాతావరణంలో బయలుదేరాయి.ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే కవితక్కకు పేద ప్రజల అండదండలు ఉన్నాయని తెలిపారు.రాబోయే రోజుల్లో కవితక్క రాష్ట్ర పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం, ప్రజల ఆకాంక్షల మేరకే కవితక్క ఈ నూతన పార్టీని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని,గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు.నూతన పార్టీ ఆవిర్భావం అనంతరం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ,ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కప్పాటి పాండురంగా రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నాటి చంద్రకాంత్,రాయకంటి జగన్ శివరామకృష్ణ, ఇందిరమ్మ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.











