కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ, యజమాన్యాలకు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారు.

ప్రజా గొంతుక( ఏప్రిల్ 28) కాల్వ శ్రీరాంపూర్ : అఖిల భారత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 140వ మే డే కరపత్రాలు ఆవిష్కరణ. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏఐఎఫ్ టీ యు రాష్ట్ర కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఆధ్వర్యంలో 140వ మే డే కార్మిక పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాల కేంద్రం ముందుకు పోతుందని,ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న హక్కులు కాలరాస్తూ, పరిశ్రమలకు యజమాన్యలకు,కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందన్నారు. కార్మిక హక్కులను హరిస్తూ నేడు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడాన్ని,వ్యతిరేకిస్తూ 140 మే డే ను గ్రామ గ్రామణ జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు వంతపడుతూ, అమెరికా ఇజ్రాయిల్ దేశాలు,ఇరాన్ పై చేసుతున్న యుద్ధం పై మాట్లాడకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు. గ్యాస్ నిల్వలు మధ్యతరహా పరిశ్రమలు, మూసివేతకు గురై, వేలదిమంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డారయని, బ్లాక్ మార్కెట్ దళారులకు లాభం కురిపిస్తుందని వారు విమర్శించారు. నిత్యవసరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని,కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వలు రెండు ఒకటేనాని, కార్మిక హక్కులను కాల రాస్తున్నారని వారు తెలిపారు. అందుకే కార్మిక కర్షక ఐక్యతో మే డే ను అన్ని గ్రామాల్లో విజయవంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు రాజన్న,కోరేపు మల్లేష్,సురేష్,పాల్గొన్నారు.











