*మొక్కజొన్న మార్కెట్లో రైతులపై వేసే దాడువాయ్ , హమాలి చార్జీలను ప్రభుత్వమే భరించాలి.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 30 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం
ఎం సి పి ఐ యు పార్టీ చెన్నారావుపేట మండల కార్యదర్శి జన్ను రమేష్ చెన్నారావుపేట మండల కేంద్రంలో ఎం సిపిఐ యూ పార్టీ ఆధ్వర్యంలో పాల్గొని రమేష్ మాట్లాడుతూ రైతుల పంటల ఉత్పత్తి ఖర్చులు పెరిగి పండించిన పంటలను కనీస మద్దతు ధర రాక ఆర్థిక సంక్షోభం లో ఉన్నారని , ఇలాంటి పరిస్థితుల లో ఉన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని , పంట పండించిన రైతులు మార్కెట్లో అమ్ముకునే సందర్భంలో హమాలి, దాడువాయి రైతులపై వేయకుండా , ఇతర చార్జీలను మార్కెట్ బడ్జెట్ నుంచి భరించి రైతులను ఆదుకోవాలని, అలాగే రెగ్యులర్ గా కాంటాలు ,ట్రాన్స్పోర్ట్ ఎక్కువ మొత్తం చేయాలని , గన్నిసంచులు రైతులకు అందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో సాంబయ్య , మల్లయ్య, బాలు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.











