*పదవ తరగతి లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 30 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్లో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం ( 30 ఏప్రిల్ 2026 ) రోజున *సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి* ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు లక్ష్యంగా చదువులను కొనసాగించాలన్నారుఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్కులు సాధించే విధంగా ప్రణాళిక చేసుకుని చదువుల్లో రాణించాలని ఆయన సూచించారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన నాంపల్లి అక్షయ ,ముద్దనూరు మానస, మేడి సహస్ర ,బొజ్జ సహస్ర, కిరణ్మయి లతోపాటు పలువురి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అండెం కరుణాకర్ రెడ్డి, డైరెక్టర్ వీరమల్ల మాధవరెడ్డి, ఏవో మోతే ఇంద్రసేనారెడ్డి, మేడ్ రమేష్ గౌడ్. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.











