రైతు సంగ్రామ సభకు కదిలిన బిఆర్ఎస్ సైన్యం…
కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతాం
సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
వరంగల్ పట్టణంలో నేడు జరగనున్న రైతు సంగ్రామ సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలను సర్పంచుల ఫోరం మండలం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, చల్ల శ్రీనివాసరెడ్డి, ఈదులకంటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు కదిలి వెళ్లారు. వాహనాల ముందు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి బిఆర్ఎస్ సైనికులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం, కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్‌పై నిలదీస్తామని, ‘రైతుల పంటలను కొనుగోలు చేయడంలో సర్కారు విఫలమవ్వడం, యాసంగి రైతు భరోసా ఇప్పటికీ పూర్తిగా అందించకపోవడం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాలలో రైతుల వడ్లు కొనుగోలు చేయక రైతులను అరిగోసపెడుతున్న ప్రభుత్వంపై పోరాటం, ఇంకా రైతుల సమస్యలపై జరుగుతున్న ఈ సభకు మండలం నుండి రైతులు బిఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎండి ఫిరోజ్, ఆరే రవి, నాయకులు మూసిని రాజు, ఎండి అజీమ్, హరి ప్రసాద్, ఉపసర్పంచ్ చింతల రాజు, బందారం వినయ్, కుమారస్వామి, తిరుమల్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.











