బీఆర్ఎస్ భారీ రైతు సదస్సు రైతులను తరలించిన యువ నాయకులు….
రేవంత్ పాలనలో రైతంగానికి జరుగుతున్న అన్యాయంపై ఎండగట్టడానికే సంగ్రామ సదస్సు….

మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
రైతు సమస్యలపై గళమెత్తే సమయం ఆసన్నమైందని, నేడు హనుమకొండలోని హంటర్ రోడ్డులో నిర్వహించనున్న ‘రైతు సంగ్రామ సదస్సు’ను విజయవంతం చేయడానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు, రైతులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, హామీల అమలులో పూర్తిగా వైపల్యం చెందిందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, ధాన్యం కొనుగోలు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి యూరియా కొరత, విద్యుత్ అంతరాయాలు, సాగునీటి సమస్యలు అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం..420 హామీలు, 6 గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్ని వర్గాలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్లు వేముల లక్ష్మణ్ గౌడ్ ,కానుగంటి బాలచందర్ యువ నాయకులు గంగం శివ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు,తదితరులు, పాల్గొన్నారు.











