శారీరక ధృఢత్వం – మానసిక ప్రశాంతత ధ్యాన మార్గం…….

ధమ్మ యోగా కేంద్రం – హాలియా
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా శ్లోక స్కూల్ ప్రాంగణంలో ఉదయం 7:30 గంటలకు, సురభి రాంబాబు జన్మదిన వేడుకలు మరియు యోగా కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.
నేటి కార్యక్రమ విశేషాలు
ప్రకృతి సిద్ధమైన వేడుక:జన్మదినం సందర్భంగా ఆరోగ్యకరమైన పుచ్చకాయతో కేక్ కట్ చేసి వినూత్నంగా వేడుక జరుపుకున్నాము.
గౌరవ సత్కారం పుట్టినరోజు జరుపుకుంటున్న సాధకులు సురభి రాంబాబుని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ధ్యాన దీవెనలు: సామూహిక ధ్యానం ద్వారా ప్రకృతి శక్తితో వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు దీవెనలు అందజేశాము.
ముఖ్య సందేశం
నిరంతర యోగా సాధనలో ఉన్న రాంబాబు కి ధమ్మ యోగా కేంద్రం తరపున హృదయపూర్వక ఆశీస్సులు. 21 రోజుల ఈ శిక్షణ మీ జీవితంలో కొత్త వెలుగును, సంపూర్ణ ఆరోగ్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము.
తేదీ: 06/05/2026
కోర్స్:21 రోజుల యోగా శిక్షణనిరంతర సాధన – నిత్యం ప్రసన్నం
ధమ్మ యోగా కేంద్రం తరపున సురభి రాంబాబు కి జన్మదిన శుభాకాంక్షలు











