రైతుల సంక్షేమం కోసం బ్యాంకు అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తాం.. సింగిల్ విండో పాలకవర్గం సభ్యులు..

ప్రజా గొంతుక( మే 6 )కాల్వ శ్రీరాంపూర్ :ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగున్నాయి. యధావిధిగా పాత పాలకవర్గాల్లే కొనసాగించలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇంతవరకు మాజీలుగా ఉన్నవారు,కొన్ని నెలల పాటు తాజాగా పాత పదవుల్లో పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో సింగిల్ విండో చైర్మన్ గా చదువు రామచంద్రారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే డైరెక్టర్ లు కూడ పదవి బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ లను మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గొపగాని సారయ్య గౌడ్, కాంగ్రెస్ సర్పంచ్, ఉప సర్పంచ్ కార్యకర్తల తో కలిసి వారిని శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా చేర్మెన్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమ కోసం, బ్యాంకు అభివృద్ధి కోసం, తమ పాలకవర్గం అంకితభావం తో పనిచేస్తామని అన్నారు. మళ్లీ పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఓ కొల్లేటి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు,రైతులు, తదితరులు ఉన్నారు.











