దరఖాస్తుదారుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం.

ప్రజా గొంతుక (మే 6 )కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూ నిర్వహించినట్లు ఎంపీడీవో రామ్మోహన చారి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామాని వారు అన్నారు. ఈ ఎస్సీ కార్పొరేషన్ లో 103 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా,76 లబ్ధిదారులు హాజరుకాగా, వారికి ఇంటర్వ్యూ నిర్వహించినట్లు వారు తెలిపారు.ఎస్బిఐ, కేడిసి బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, అధికారులు ఆధ్వర్యంలో వారు దరఖాస్తు చేసుకున్న పత్రాలను పరిశీలించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి పవన్ కుమార్, సూపరిండెంట్ శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, అసిస్టెంట్ లక్ష్మయ్య, కంప్యూటర్ ఆపరేటర్ వెంకన్న, బ్యాంకు అధికారులు సాయి ప్రకాష్, కరుణ శ్రీ, రాజశేఖర్, ఎంఏఓ సంధ్య, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.











