నిరుపేద కుటుంబాలకి మనవంతు చేయూత ఇద్దాం……..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06
పరుచూరి మల్లీఖార్జునరావు.. అలీనగర్ ( చెక్ పొస్ట్ ) గత కొంతకాలం గా కంటిచూపు సమస్య తో భాదపడుతున్నారు ఇంట్లో ఆర్దీక ఇబ్బంది ఉందని మన
అమీర్ అలి ఫౌండేషన్ ని సహాయం కోరారు మిత్రులు సభ్యుల సహకారం తో హలియా కిరాణా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంచుకొండ వెంకటేశ్వర్లు 25 కేజిల బియ్యం ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నెల రోజులు సరిపడ నిత్యవసర సరుకులు కూరగాయలు అందించడం జరిగింది
ఈ సంధర్భంగా మల్లీఖార్జునరావు మాట్లాడుతూ కంటి చూపు సమస్య తో భాదపడుతున్నా నేను గత కొంతకాలంగా పనిచేసుకోలేని పరిస్థితి లో ఇంటికే పరిమితం అయ్యాను నా ఆర్దీక ఇబ్బంది చూసి చలించి మానవత్వం తో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అమీర్ అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలి ఉపాధ్యాయులు ఇసరాజు సైదులు ఖాజమైనుద్దిన్ గౌస్ బాబ హలియా కిరాణా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంచుకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు











