నేల ఆరోగ్య పరిరక్షణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు సూచనలు చేసిన శాస్త్రవేత్తలు..ఏవో..

ప్రజా గొంతుక (మే 06)కాల్వ శ్రీరాంపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పాలనలో- ప్రగతి ప్రణాళికలో భాగంగా 99వ రోజుల కార్యచరణల భాగంగా, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో, రైతు వారము కార్యక్రమాన్ని రైతు వేదికలో నేల ఆరోగ్య పరిరక్షణ కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మండల కేంద్రంలో అలాగే కునారం గ్రామంలోని రైతు వేదికలో ప్రగతి ప్రణాళికలో భాగంగాఈ నెల 04 నుంచి 09 వరకు జరిగే రైతు వారము వారోత్సవముల కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త డాక్టర్ వినోద్, ఏఓ సంధ్య, ప్రత్యామ్నాయ సాగు పంటలు, వరి కొయ్యలు కాల్చడం వలన జరిగే నష్టాలు, కలియ దున్నడం వల్ల జరిగే లాభాలు,నేల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తరణ చేయాలని, ఆరుతడి పంటల పెంపుదల, అనవసర ఖర్చులు తగ్గింపు,పంట మార్పిడి పద్ధతులను పాటించాలని, రసాయన ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వులు వాడడం వలన అధిక లాభాలు ఉంటాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటలు వినియోగించుకోవాలని, వాటి వలన అధిక లాభలు ఉంటాయని సూచించారు.తెలంగాణ సోనా, కూనారం వరి 02(కే ఎన్ ఎమ్ 1638),సిద్ధి (డబ్ల్యూ జి ఎల్ ), ఎచ్ ఎమ్ టీ సోనా, జైశ్రీరామ్ లాంటి వరి విత్తనాలను రైతులు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, తాసిల్దార్ డాక్టర్ రాముడు, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, కేడీసీసీ బ్యాంకు మేనేజర్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ సబ్బని రాయమల్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, రైతులు ఫీల్డ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.











