నేడు మహేశ్వరం నియోజకవర్గంలో సౌర విద్యుత్‌పై ప్రత్యేక సమావేశం

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 06:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో… ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారం కార్యక్రమాల సందర్భంగా,రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు మహేశ్వరం నియోజకవర్గ స్థాయి సమావేశం తుమ్మలూరు గ్రామంలో జరగనుంది.ఈ సమావేశంలో సౌర విద్యుత్‌పై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.
అలాగే ఆమనగల్,కడ్తాల్,మాడ్గుల,తలకొండపల్లి మండలాలకు సంబంధించిన రైతుల కోసం ఆమనగల్ రైతు వేదికలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసినట్లు కందుకూరు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ గోపాలకృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమాలకు రైతులు,ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Post Views: 37











