అక్కల్ చెడ లో ఉచిత పశు వైద్య శిబిరం.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్), 08 మే 2026.వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామంలో , *ప్రజా పాలన ప్రగతి* ప్రణాళికలో భాగంగా ఈ రోజు గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ ఆధ్వర్యంలో వెటర్నరీ డాక్టర్ మంగీలాల్ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామంలో పాడి రైతులు తీసుకు వచ్చిన పశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందని కొన్ని పశువులకు చూడి పరీక్ష నిర్వహించడం జరిగిందని దూడలకు నట్టల నివారణకు మందులు ఇవ్వడం జరిగిందని వెటర్నరీ డాక్టర్ మంగీలాల్ తెలిపారు.. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ మాట్లాడుతూ ఉచిత పశు వైద్య శిబిరాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని పాడి రైతులు పశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే సమస్య పరిష్కరించుకోవాలని వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉంటారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తూటి పావని రమేష్ , వార్డు సభ్యులు ఇస్లావత్ స్వరూప వీరు , రైతులు తేజవత్ బద్రు , వీరు నాయక్ , రాజు , ప్రవీణ్ , విజేందర్ వెటర్నరీ అసిస్టెంట్ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.











