*ఎస్ బిఐ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే అమలు చేయాలి*

ప్రజా గొంతుక న్యూస్, సూర్యాపేట : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల 16 డిమాండ్లు వెంటనే అమలు చేయాలని రీజినల్ సెక్రటరీ అయితగొని మహేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రీజియన్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన మెసెంజర్ల నియామకాలు చేపట్టాలని, ఆర్మ్డ్ గార్డుల నియామకం,ఎన్ పి ఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ మార్చుకునే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఔట్సోర్సింగ్ విధానాన్ని నిలిపివేసి తగిన సిబ్బందిని నియమించాలని తెలిపారు.పెన్షన్, మెడికల్ రీయింబర్స్మెంట్, హెచ్ ఆర్ ఎం ఎస్ సమస్యలు, ఉద్యోగుల బదిలీలు, కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ వంటి అంశాలపై కూడా యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. మే 25, 26 తేదీలలో జరిగే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లోకల్ సెక్రటరీ లు సురేష్, హేమలత, నవీన్, క్రాంతి, కిషోర్, ప్రియాంక, చందు, కిరణ్, నవ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు.











